Site icon Prime9

Pathapati Sarraju : ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మృతి..

ex mla, kshatriya corporation chairman sarraju passed away

ex mla, kshatriya corporation chairman sarraju passed away

Pathapati Sarraju : ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు. సర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం (Pathapati Sarraju)..

కాగా, కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా.. ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

2014కు ముందు వైసీపీలో చేరి మళ్లీ ఉండి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. సర్రాజు మృతికి సంతాపంగా వైసీపీ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar