Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారన చేపట్టగా.. ఇందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని పేర్కొంది. ఈ మేరకు జనవరి 7కు వాయిదా వేసింది.
అయితే, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై కేసీఆర్‌తో పాటు హరీష్ రావు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, భూపాలపల్లి కోర్టు మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
తాజాగా, ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయస్థానం విచారణ చేపట్టింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులు సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై గతంలో భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టగా.. హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు అందించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా పడింది.