Site icon Prime9

ED searches in AP hospitals: ఏపీ ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు

ed-issues-notices-to-26-members-regarding-ap-skill-development-scam

ed-issues-notices-to-26-members-regarding-ap-skill-development-scam

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పలు  ఆసుపత్రుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని మంగళగిరి ఎన్నారై హాస్పిటల్‌లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎన్నారై హాస్పిటల్‌లో ఈడీ అధికారులు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నారై ఆస్పత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈడీ అధికారులు ఎన్నారై హాస్పిటల్‌లోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కోవిడ్ సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని గతంలోనే ఎన్నారై ఆస్పత్రిపై కేసు నమోదు అయింది. మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు కూడా వచ్చాయి. యాజమాన్య సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో వైద్యురాలుగా ఉంటున్న అక్కినేని మణి.. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar