ED Rides : హైదరాబాద్‌లో ఈడీ దాడులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్‌లోని.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు మొత్తంగా 20 రాష్ట్రాల్లో ఉన్న 100 కు పైగా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్ చేశారు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. రద్దయిన ఫార్మా కంపెనీల లిస్ట్ లో హైదరాబాద్‌కి చెందిన ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.
ఫినిక్స్ కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు (ED Rides)..
ప్రస్తుతం నగరంలో ఫినిక్స్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, ఫినిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్, ఎండీ అవినాష్ నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెం. 45లోని ఫినిక్స్ ప్రధాన కార్యాలయంలోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించింది.
కాగా ఫినిక్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తుంది. గతేడాది ఆగస్టు 23న ఆదాయ పన్ను శాఖ పన్ను ఎగవేశారనే ఆరోపణలతో ఫినిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల గురించి పూర్తి సంచారం ఇంకా తెలియాల్సి ఉంది.