Site icon Prime9

Usthad Bhagath Singh : ఉస్తాద్ కోసం మళ్ళీ కలిసిన పవన్ – హరీష్ – దేవి కాంబో..

devi sri prasad going to music for pawan Usthad Bhagath Singh

devi sri prasad going to music for pawan Usthad Bhagath Singh

Usthad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి కాంబో ఇన్నేళ్ల తరువాత రీపీట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తోడయ్యాడు.

ఇక తాజాగా మరోసారి ఈ త్రిబుల్ కాంబో.. ఉస్తాద్ భగత్ సింగ్ కు సెట్ అయ్యిన్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్, కెవ్వు కేక లాంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి అంటే.. దేవి కొట్టిన మ్యూజిక్ లోని మ్యాజిక్ అలాంటింది. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

 

ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్- దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కలిసినట్లు వీడియో షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్, దేవి శ్రీ కలిసి సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో మేకర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంకోపక్క దేవికి అంతకు ముందు ఉన్న యాక్టివ్ నెస్ ఇప్పుడు లేదు.దేవి సైతం ఫ్రెష్ మ్యూజిక్ కాకుండా కాపీ కొట్టే మ్యూజిక్ ఇస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అలాంటి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దేవి.. ఈసారైనా పాత దేవిని గుర్తుచే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి ఈ రాక్ స్టార్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar