Site icon Prime9

Deputy CM Pawan Kalyan: నాగబాబు నా సోదరుడు అని కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan talks about Minister post for Nagababu: జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా పవన్ కల్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. పార్టీ స్థాపించినప్పటినుంచి నాగబాబు నాతో పాటు సమానంగా కష్టపడి పనిచేశారన్నారు. మనతో పాటు శ్రమించడంతో పాటు పనిచేసిన వారిని నేను గుర్తించాలని, అందుకే ఆయనకు పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘నాగబాబు నా సోదరుడు అని కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని, నాతో సమానంగా నాగబాబు పనిచేశారన్నారు. నా సోదరుడు కాకపోయినా.. కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకావం ఇచ్చేవాడినని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కందుల దుర్గేష్‌ది ఏ కులమో నాకు తెలియదని, నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడినని చెప్పారు. నాతో కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేమని స్పష్టం చేశారు.

మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని చెప్పారు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి వస్తారని వివరించారు. ఆ తర్వాతే మంత్రి అంశంపై చర్చ చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Exit mobile version