Site icon Prime9

Deputy CM Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన.. పోర్టులో ఆకస్మిక తనిఖీలు

Deputy CM Pawan Kalyan inspect at Kakinada Port: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, అంతకుముందు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నారు.

కాకినాడ పర్యటనలో భాగంగా పలుచోట్ల ఆయన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా కాకినాడ పోర్టుతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేయనునట్లు తెలుస్తోంది. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పలు సమీక్షలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అరబిందో ఫార్మా బాధితులను సైతం పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇవాళ సాయంత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. కాగా, ఇటీవల కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకొని రెండురోజులు పూర్తికాక ముందే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈ పర్యటన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Exit mobile version