New Zealand: గాబ్రియెల్ తుఫాను ఎఫెక్ట్.. న్యూజిలాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

గాబ్రియెల్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 12:37 PM IST

New Zealand: గాబ్రియెల్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తుఫాను కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలుచోట్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

న్యూజిలాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించడం మూడోసారి..(New Zealand)

దేశ చరిత్రలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి కావడం విశేషం. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రదాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో న్యూజిలాండ్ లో అత్యవసరపరిస్దితి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదిఆరు ప్రాంతాలకు నార్త్‌ల్యాండ్, ఆక్లాండ్, తైరావితి, బే ఆఫ్ ప్లెంటీ, వైకాటో మరియు హాక్స్ బే లకు వర్తిస్తుంది. భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా పదివేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోన్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌లో దాదాపు 58,000 మంది నివాసితులు చీకట్లో ఉన్నారు. విద్యుత్తు పునరుద్ధరణకు రెండ్రోజులు పట్టవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అత్యవసర నిర్వహణ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.ఇది ఊహించని విపత్తు. నార్త్ ఐలాండ్‌లో చాలా వరకు పెద్ద ప్రభావాన్ని చూపుతోందని మెక్‌అనుల్టీ చెప్పారు.

న్యూజిలాండ్ వాసులకు కాళరాత్రి..(New Zealand)

దేశవ్యాప్తంగా న్యూజిలాండ్ వాసులకు ఇది ఒక కాళరాత్రి. ఎగువ ఉత్తర ద్వీపంలో .చాలా కుటుంబాలు స్థానభ్రంశం చెందాయి, విద్యుత్ లేకుండా చాలా గృహాలు, దేశవ్యాప్తంగా విస్తృతమైన నష్టం జరిగిందని ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ చెప్పారు. గాబ్రియెల్ ఆక్లాండ్‌కు తూర్పున 100 కి.మీ (60 మైళ్ళు) దూరంలో ఉంది.ఇది దేశం యొక్క తూర్పు తీరానికి సమీపంలో ఉంది. దాదాపు తీరానికి సమాంతరంగా తూర్పు-ఆగ్నేయ దిశగా కదులుతుందని భావిస్తున్నారు.

మంగళవారం మరింత వర్షం మరియు అధిక గాలులు ఎమర్జెన్సీ సేవల ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయని మెక్‌అనుల్టీ చెప్పారు.. ప్రతికూలవాతావరణంతో సోమవారం విమానాలను నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం కొన్ని సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఎయిర్ న్యూజిలాండ్ తెలిపింది.వరద నీటితో చుట్టుముట్టబడిన భవనాల పైన కూర్చున్న వ్యక్తుల ఫోటోలు మరియు వీడియోలను స్థానిక మీడియా ప్రచురిస్తోంది.వెస్ట్ ఆక్లాండ్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో తమ సిబ్బందిలో ఒకరు తప్పిపోయారని మరియు మరొకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూజిలాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.

ముందే హెచ్చరించిన న్యూజిలాండ్ మెట్ సర్వీస్..

గాబ్రియెల్ తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.తూర్పున కోరమాండల్ ప్రాంతం 400 మి.మీ వర్షం కురిసే అవకాశముందని మెట్‌సర్వీస్ తెలిపింది. ఆక్లాండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డిప్యూటీ కంట్రోలర్, రాచెల్ కెల్లెహెర్ మాట్లాడుతూతుఫానుమంగళవారం తెల్లవారుజామున అధిక ఆటుపోట్లతో సమానంగా ఉంటుందన్నారు. ఉత్తర ద్వీపం యొక్క పశ్చిమ కొనలో ఆదివారం ఉదయం 140 కిమీ/గం వేగంతో గాలులు వీచాయి. దీనితో తుఫాను కారణంగా ఏర్పడే ప్రతికూల పరిస్దితులను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం సన్నద్దమయింది.

ఇవి కూడా చదవండి: