Site icon Prime9

CM Revanth Reddy: హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

CM Revanth Reddy Reached Hyderabad after davos tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన దుబాయ్ మీదుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌ బృందానికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం తన కాన్వాయ్ నుంచి అభివాదం చేశారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వందలాది మంది కార్యకర్తలు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.  ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఈ పర్యటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం రేవంత్ బృందం హాజరయ్యారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జరిగిన సింగపూర్, దావోస్ పర్యటనలు విజయవంతమయ్యాయి. ఇందులో భాగంగానే దావోస్‌లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. అయితే, గత పర్యటనలో రూ.40వేల పెట్టుబడులు తీసుకురాగా.. ప్రస్తుతం 4 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడులతో సుమారు 50వేల వరకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 20 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

Exit mobile version