Site icon Prime9

CM KCR: వరంగల్ బయల్దేరిన సీఎం కేసీఆర్

CM KCR warangal tour

CM KCR warangal tour

CM KCR: నేడు సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌ట‌ించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్‌కు ముఖ్యమంత్రి  బ‌య‌ల్దేరారు. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ టు వ‌రంగ‌ల్ వెళ్లే రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లను అమలులో ఉంచారు. ములుగు రోడ్డులో నిర్మిం‌చిన ప్ర‌తిమ రిలీఫ్‌ ఇన్‌‌స్టి‌ట్యూట్‌ ఆఫ్‌ మెడి‌కల్‌ సైన్సెస్‌ హాస్పి‌టల్‌, క్యాన్సర్‌ ఇన్‌‌స్టి‌ట్యూ‌ట్‌ను సీఎం కేసీఆర్ ప్రారం‌భిం‌చ‌ను‌న్నారు. కళాశాల ప్రారం‌భో‌త్సవ అనం‌తరం తిరిగి హైద‌రా‌బాద్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వైద్యా‌రోగ్య మంత్రి హరీ‌శ్‌‌రావు, పంచా‌య‌తీ‌రా‌జ్‌‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయా‌క‌ర్‌‌రావు తదితర నేతలు పాల్గొ‌న‌ను‌న్నారు.

కాగా వరంగల్ భద్రకాళీ అమ్మవారిని కూడా ఈ పర్యటనలో భాగంగా దర్శించుకోనున్నారని అంచనా. అయితే శుక్రవారం నాడు యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి, తొలుత గుట్ట చుట్టూ  గిరిప్రదక్షిణ చేసి అనంతరం  స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: భారత్ జోడో యాత్ర.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే.. రేవంత్

Exit mobile version