CM KCR: సీఎం కేసీఆర్ కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న విధంగానే.. కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా.. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి.. రూ. 5 లక్షల బీమా ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గీత కార్మికులకు బీమా..
సీఎం కేసీఆర్ కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న విధంగానే.. కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా.. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి.. రూ. 5 లక్షల బీమా ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుడు చనిపోయిన వారం రోజుల్లోగా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ బీమా కు సంబంధించి సీఎం.. సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
కల్లుగీసే సమయంలో.. ప్రమాదావశాత్తు జారిపడి ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.
దీంతో వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
రేపే నీరా కేఫ్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించనున్నారు.
గౌడ కులస్థులకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతిసిద్ధమైన నీరాను అందించాలని నిర్ణయించింది.