China Manza: సంక్రాంతి సందర్భంగా చిన్న పెద్ద అందరూ ఉత్సహంగా గాలిపటాలను Kites In Hyderabad ఎగరవేస్తారు. అయితే చాలా చోట్ల పతంగులకు ఎగరవేయడానికి చైనా మంజాను ను ఉపయోగిస్తున్నారు. దీంతో వారి తాత్కాలిక ఆనందం కోసం.. పక్షులను ఇతరులను ఇబ్బందుల్లో పెడుతున్నారు. ఈ దారం చాలా గట్టిగా ఉండటంతో దీని వల్ల పక్షులు, మనుషులు ప్రమాదాలకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంటకు చైనా మంజా చుట్టుకొని గాలిలో ఎగిరిపడ్డా ఘటన జరిగింది. హై కోర్టు బార్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ సుమన్ భార్యతో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. కిస్మత్ పూర్ వెళ్తుండగా మంజా దారం చుట్టుకొని ఇద్దరు బైక్ పై నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
మంజా దారం గొంతుకు చుట్టుకుంది.
ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బండ్లగుడ జాగిర్ మున్సిపల్ పరిధిలో జరిగింది. ఇంకాస్త బలంగా దారం తాకి ఉంటే ప్రాణాలు పోయేవణి సుమన్ అన్నారు. చైనా మంజాను వెంటనే బ్యాన్ చేయాలని.. ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తండ్రితో కలిసి బైకుపై వెళ్తున్న చిన్నారి గొంతు కోసుకుపోయింది. ఇదే ప్రమాదంలో తండ్రికి సైతం గాయాలయ్యాయి. ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి వస్తుండగా.. నాగోల్ వంతెనపై చైనా మాంజా తగిలి చిన్నారి మెడ కోసుకుపోయి.. లోతుగా గాయమైంది.
చిన్నారి మెడ నుంచి రక్తస్రావం అవడంతో స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. మంజా దెబ్బతో చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి ఘటనలు ఎన్నో
పతంగులు ఎగరేయటం సరదే.. కానీ ఈ సరదా విషాదంగా ముగిసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
గాలిపటాలు ఎగరేస్తూ చిన్నారులు కిందపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు తీవ్ర గాయాల పాలైన వారు ఉన్నారు.
చైనా మంజాను వాడకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవటం లేదు.
ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. చైనా మంజాను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/