Prime9

Kantara movie : కాంతార మూవీపై వైరల్ అయిన చిలుకూరు ఆలయ పూజారి ట్వీట్

Kantara movie :  ఇటీవల కన్నడలో విడుదలైన కాంతార చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లోకి కూడా డబ్ చేయబడింది. అన్ని భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది.

కాంతార కర్ణాటకలోని కుందపురా ప్రాంతంలో జరుపుకునే పురాతన గిరిజన పండుగ చుట్టూ తిరుగుతుంది. ప్రజలు ఆ పాయింట్‌కి కనెక్ట్ అయ్యారు.ఈ చిత్రం హిందుత్వాన్ని గొప్పగా ప్రచారం చేస్తుందని మరియు హిందూ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.ఇప్పుడు చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవతలు తమకు ఇచ్చిన వాగ్దానాలను సీరియస్‌గా తీసుకుంటారని, వాటిని అమలు చేయగలరని, అమలు చేస్తారని, రాజ్యాంగబద్ధంగా కూడా అలా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఆయన అన్నారు.

ఆర్టికల్ 363 హిందూ దేవత హక్కుల వివాదం మరియు ధర్మ విజయం. చివరికి దేవతలు తమకు ఇచ్చిన వాగ్దానాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.వాటిని అమలు చేయగలరు . రాజ్యాంగబద్ధంగా కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనే #కాంతార చలనచిత్రం ముఖ్య సందేశానికి నిజమైన ఉదాహరణ అని ట్వీట్ చేసారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version
Skip to toolbar