Site icon Prime9

Kasturi Shankar: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు – నటి కస్తూరిపై కేసు నమోదు

Case Filed Actress Kasthuri: నటి కస్తూరి తెలుగువారికి క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కాగా నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు,తమిళంలో పలు చిత్రాల్లో నటించిన నటిగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపై మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. అయితే కస్తూరి తరచూ సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడులో జరుగుతున్న బ్రహ్మణుల నిరసనలో ఆమె మాట్లాడుతూ తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ విషయంలో తెలుగు సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతఃపురంలో రాణులకు సేవ చేసేందుకు వచ్చింది తెలుగువారేనని, ఇప్పుడు తామే అసలైన తమిళులం అంటున్నారని వ్యాఖ్యానించారు. తెలుగు వారిని కించపరుస్తూ చేసిన ఆమె వ్యాఖ్యలను తెలుగు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తనపై వస్తున్న నెగిటివిటీ నేపథ్యంలో ఆమె సోషల్‌ మీడియాలో వేదిక క్షమాపణలు కోరారు. అంతేకాదు తాను కొందరిని మాత్రమే ఉద్దేశించిన ఈ వ్యాఖ్యలు చేశానంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయితే అప్పటికే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బ్రహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జరుగుతున్న నిరసనలలో ఆమె వ్యాఖ్యలు అల్లర్లను మరింత రెచ్చగోట్టెలా ఉండటంతో చెన్నై ఎగ్మూర్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version