Site icon Prime9

SpiceJet MD Ajay Singh: స్పైస్‌జెట్‌ సీఎండీపై చీటింగ్‌ కేసు

Gurugram: స్పైస్‌జెట్‌ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌సింగ్‌ పై గురుగ్రామ్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తకు కోట్లాది షేర్లను మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. విమానయాన రంగానికి చెందిన కన్సెల్టెంట్‌ అమిత్‌ అరోరా తను చేసిన సేవలకు గాను 10 లక్షల విలువ చేసే షేర్లు, నకిలి డిపాజిటరీ ఇన్‌స్ర్టక్షన్‌ స్లిప్స్‌ అందజేశారు. దీంతో పాటు మరో పది లక్షల స్పైస్‌జెట్‌ షేర్లను తాను చేసిన సర్వీసెస్‌కు ఇస్తామని హామీ ఇచ్చారని అరోరా పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. ఇలాంటి మోసాలే ఎయిర్‌లైన్స్‌ ప్రమోటర్ల నుంచి ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు అజయ్‌సింగ్‌ పాల్పడ్డాడని అరోరా ఆరోపించారు.

అరోరా పోలీసులకు చేసిన ఫిర్యాదులో అజయ్‌ సింగ్‌ తనకు ఇచ్చిన డిపాజిటరీ ఇన్‌స్ర్టక్షన్‌ స్లిప్‌ ఔట్‌డేటెడవని, అవి నగదుగా మారలేదని వివరించారు. అటు తర్వాత తాను పలుమార్లు అజయ్‌సింగ్‌ను కలిసి చెల్లుబాటు అయ్యే డిపాజిటరీ ఇన్స్‌స్ర్టక్షన్‌ స్లిప్‌లు అయినా ఇవ్వండి. లేదా షేర్లను నేరుగా తన ఖాతాకు బదిలీ చేయాలని కోరినా, అప్పటి నుంచి ఏవో కారణాలు చెబుతూ షేర్లను బదలీ చేయడానికి అజయ్‌సింగ్‌ నిరాకరించారని అరోరా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌ పోలీసులు స్పైస్‌జెట్‌ సీఎండీ పై 406, 409, 415, 417, 420 సెక్షన్‌ల కింది కేసు సుశాంత్‌ లోక్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పెస్‌జెట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ అజయ్‌ సింగ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి లిక్కర్‌ డీలర్‌ అమిత్‌ అరోరా కంకణం కట్టుకున్నారని అన్నారు. స్పైస్‌జెట్‌ ఎప్పుడూ అరోరా సేవలను వినియోగించుకోలేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని, అతనితో లిఖిత పూర్వక ఒప్పందం కూడా లేదని ఆయన వివరించారు.

Exit mobile version