Site icon Prime9

Minister Harish Rao:వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్రం సీతకన్ను

Center discrimination on establishment of medical colleges in Telangana 

Center discrimination on establishment of medical colleges in Telangana 

Discrimination: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు .రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ మీడియాతో పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో నాటి మాటల కల ఇప్పుడు నిజమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా, నేడు ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 17కు చేరుకొందన్నారు. 850సీట్లతో ఉన్న మెడికల్ సీట్ల సంఖ్య 8ఏళ్లలో 2052 సీట్లకు పెరిగాయని పేర్కొన్నారు.

సీట్లు సంఖ్య పెరిగితే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్ర వైద్య కళాశాలలను మంజూరు చేయకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Traffic Restrictions: పూలసంబురం ముగింపు.. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Exit mobile version