Site icon Prime9

Jd Lakshmi Narayana : జీవో నెం. 1 ను సమర్ధించిన జేడీ లక్ష్మీనారాయణ… సీఎం జగన్ కు సపోర్ట్?

cbi ex jd lakshmi naraya support ysrcp government over go number 1

cbi ex jd lakshmi naraya support ysrcp government over go number 1

Jd Lakshmi Narayana : ఇటీవల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటనల నేపథ్యంలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయా ఘటనల్లో నెల్లూరులో 8 మంది, గుంటూరులో 3 మహిళలు మృతి చెందారు. ఈ తొక్కిసలాట ఘటనలు ఎంతో విషాదాన్ని కలిగించాయని సీఎం జగన్ కూడా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తొక్కిసలాటల దృష్ట్యా, ఏవైనా పార్టీలు, సంస్థలు, వ్యక్తులు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌ షోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో1 అమలు లోకి తెచ్చింది. తాజాగా విడుదల చేసిన జీవో నెం.1 పై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఈ మరకు బుధవారం కుప్పంలో చంద్రబాబు పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. రోడ్ల పైన బహిరంగంగా సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరని లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ముందస్తుగా అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వటంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు చేయటం అధికారుల బాధ్యతగా చెప్పారు. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ అన్నారు. గతంలో జనసేన పార్టీలో ఉన్న జేడీ లక్ష్మీ నారాయణ ఆ తర్వాత జనసేన నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి మద్దతు తెలుపని ఆయన ఇప్పుడు వైకాపాకు మద్దతుగా మాట్లాడుతుండడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version