Cannes: 76 వ కేన్స్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోయారు. రెండు రోజు వేడుకల్లో భాగంగా హీరోయిన్ మృనాల్ ఠాకూర్ పాల్గొంది. ఫ్యూజన్ లుక్ లో కనిపించిన మృనాల్ తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దేశీ గర్ల్ ఫీల్ వస్తుందంటూ క్యాప్షన్ పెట్టింది. డిజైనర్ ఫాల్గునీ షేన్ డిజైన్ చేసిన ఊదా రంగు నెట్ చీరకు సీక్వెన్స్, పూసలతో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అందుకు తగ్గట్టుగా బ్లౌజ్ ప్రత్యేకం ఆకర్షణగా ఉంది. ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ భామలు కూడా తళుక్కుమన్నారు. సారా అలీఖాన్, ఈషా గుప్త, మానుషి చిల్లర్ ర్యాంప్ హోయలొలికించారు.