Site icon Prime9

Uttar Pradesh: అట్లుంటది ’యోగి‘ తోని బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్

Noida: గ్రేటర్‌ నోయిడాలో ఈ రోజు బుల్‌డోజర్లు యాక్షన్‌లోకి దిగాయి. బీజేపీ కిసాన్‌ మోర్చాకు చెందిన శ్రీకాంత్‌ త్యాగి అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇటీవలే త్యాగి నివసించే గ్రాండ్‌ ఒమాక్స్‌ సొసైటీకి చెందిన ఓ మహిళను దర్భాషలాడ్డంతో పాటు చేయిచేసుకోవడం సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత నోయిడా పోలీసులు త్యాగిపై గ్యాంగ్‌స్టర్‌ చట్టన్ని ప్రయోగించింది. ఆ రోజు నుంచి త్యాగి పరారీలో ఉన్నాడు.

అధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున గ్రాండ్‌ ఒమెక్సి సొసైటీలోని సెక్టార్‌ -93 కి చేరుకొని శ్రీకాంత్‌ త్యాగి అక్రమంగా నిర్మించిన కట్డడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా త్యాగి మద్దతు దారులు కూల్చివేతను అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. త్యాగి నివసించే సొసైటీలో మొక్కలు నాటడాన్ని ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళ ఉద్దేశం ఏమిటంటే క్రమంగా మొక్కలు నాటుతూ ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే నిర్మాణం చేపట్టారని కాలనీలు వాసులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత రోజు త్యాగి మద్దతు దారులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి వచ్చి మహిళ అడ్రసు గురించి వాకబు చేసి.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత బీజేపీ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. బీజేపీ దిల్లీ అధకార ప్రతినిధి కేమ్‌చంద్‌ శర్మ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. మహిళపై దుర్భాషలాడిన శ్రీకాంత్‌ త్యాగిపై కఠిన చర్య తీసుకున్నందుకు అభినందించారు. పోలీసులు అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న త్యాగి పరారయ్యాడు పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి 25వేల రూపాయల బహుమానం కూడా ప్రకటించింది. దీంతో త్యాగి కోర్టులో లొంగిపోతానని తన న్యాయవాది ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.

Exit mobile version