Site icon Prime9

ఎండ్ కార్డ్ పడనున్న బిగ్ బాస్ సీజన్ 6… విన్నర్ అతడేనా?

bigg boss telugu season 6 came to final and details about winner

bigg boss telugu season 6 came to final and details about winner

Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి ఎండ్ కార్డ్ పడనుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి వచ్చేసింది. దీంతో బిగ్ బాస్ టైటిల్ ని ఎవరు గెలుస్తారా అన్నది మాత్రం అందరిలో సస్పెన్స్ గా మారింది. 21 మందితో మొదలైన ఈ షోలో… చివరకు 5గురు ఫైనలిస్ట్ లు మిగిలారు. ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, రోహిత్, కీర్తి టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఫైనల్ కు ఒక రోజు ముందే శ్రీసత్యకు బయటకు పంపి షాకిచ్చారు బిగ్ బాస్. అయితే గత సీజన్ ల మాదిరి గానే ఈ సీజన్ లో కూడా విన్నర్ ఎవరనేదానిపై మాత్రం ప్రేక్షకులలో ఎలాంటి ఉత్కంఠ లేదని తెలుస్తుంది.

గత సీజన్ లలో పోలిస్తే ఈ సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల్లో కాస్త గుర్తింపు పొందిన వారు. దీంతో బిగ్ బాస్ కి అసలు ఏమైంది, ఎవర్రా మీరంతా అంటూ ఇప్పటికీ కామెంట్లు చేస్తూనే ఉంటున్నారు. అదే రీతిలో ఇంట్లోని సభ్యులు కూడా ఫిజికల్ టాస్కులలో మాత్రమే కాదు… చివరకు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చి ప్రేక్షకులకు కాస్త వినోదాన్ని పంచండి అని చెప్పగా అందులోనూ విఫలం అయ్యారు. చివరకు బిగ్ బాస్ తో గేమ్ ఆడండి అంటూ వార్నింగ్ కూడా తీసుకున్నారంటే ఈసారి షో ఎంత అట్టర్ ప్లాప్ అనేది అర్థమవుతుంది. ఇక అన్ ఫెయిర్ ఎలిమేషన్స్ తో ప్రేక్షకుల నుంచి ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఇనయ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ టీఆర్పీ దెబ్బకు పడిపోయింది.

విన్నర్ ఎవరంటే…

ఇక ఇప్పుడు ఫైనల్ కు మరికొద్ది గంటల సమయం మాత్రమే. ఎందుకంటే సీజన్ విన్నర్ రేవంత్ అంటూ షో మొదటి నుంచి వినిపిస్తున్నదే. ఈసారి ఇంట్లోకి వచ్చిన సభ్యులలో అత్యంత ఎక్కువ పాపులారిటీ ఉన్నది అతనికి మాత్రమే. దీంతో ఈసారి టైటిల్ విన్నర్ అతడే అని దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. రేవంత్‌ని విన్నర్‌ని చేసినందుకు ముందుగానే ధన్యవాదాలు తెలిపారు రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి.

‘మా వాడ్ని విన్నర్‌ని చేసినందుకు చాలా థాంక్స్.. ఈ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.. రేవంత్ ట్రోఫీ అందుకోవడం చాలా హ్యాపీ.. ఈ ఆనందంలో నాకు భోజనం కూడా తినబుద్ధికావడం లేదు. ఇలాంటి కొడుకు జన్మజన్మలకి నా కడుపునే పుట్టాలని కోరుకుంటున్నా… పూజలు చేస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యింది రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి. అన్నట్టు సీతా సుబ్బలక్ష్మి ఫ్యామిలీ వీక్‌లో భాగంగా రేవంత్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి తన అమాయకత్వంతో అందర్నీ ఆకట్టుకుంది. రేవంత్‌పై ఉన్న నెగిటివిటీని చాాలా వరకూ తగ్గించింది అమ్మ సీతా సుబ్బలక్ష్మి. ఇక ఈ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version