Site icon Prime9

Bhairavam: మాస్‌ లుక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – ఈసారి పవర్ఫుల్‌ టైటిల్‌తో వస్తున్న యంగ్‌ హీరో

Bellamkonda Sai Sreenivas New Movie Title Announced: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. డెబ్యూ మూవీ తప్పితే మిగతా సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో ఇటీవల ప్రభాస్‌ ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్‌ చేసి అట్టర్‌ ప్లాప్‌ చూశాడు. అలా వరుస ప్లాప్‌తో ఢిలా పడ్డ ఈ బెల్లంకొండ హీరో ఈసారి పవర్ఫుల్‌ కాన్పెప్ట్‌తో రాబోతున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించాడు.

తాజాగా ఈ సినిమాకు పవర్ఫుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ప్రకటన ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమా ‘భైరవం’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌ లుక్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో సాయి శ్రీనివాస్‌ బట్టలపై రక్తం మరకలు, చేతిలో కత్తితో రగ్గడ్‌ లుక్‌లో కనిపించాడు. ఈ ఫస్ట్‌లుక్‌ అండ్‌ టైటిల్‌ పోస్టర్‌లో సాయి శ్రీనివాస్‌ గుడి ముందు ఉన్న బలి ఇచ్చే బండపౌ ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో కత్తి పట్టుకుని ఉగ్రరూపంలో కనిపించాడు. చూస్తుంటే ఇందులో అతడిది మాస్‌ రోల్‌ అనిపిస్తోంది. విజయ్‌ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది తమిళ సినిమాకు రీమేక్‌ అని తెలుస్తోంది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన గరుడన్‌ సినిమాకు రీమేక్‌గా వస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు, నారా రోహిత్‌లు సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ఫస్ట్‌లుక్‌ ప్రకటనతో స్పష్టం చేశారు. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేస్తూ ఇందులో మంచు విష్ణు, నారా రోహిత్‌లను ట్యాగ్‌ చేసి వారు కూడా ఈ చిత్రంలో భాగమైనట్టు మూవీ టీం చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ పోస్ట్‌ ఆసక్తిని పెంచుతుంది. కాగా గతంలోయ విజయ్‌ కనకమేడల అల్లరి నరేష్‌తో ఉగ్రం, నాంది వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమాలు రెండు మంచి విజయం సాధించాయి. కొంతకాలంగా ప్లాప్స్‌ చూసిన అల్లరి నరేష్‌కు ఈ రెండు చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ తెచ్చిపెట్టి మంచి కంబ్యాక్‌ ఇచ్చాయి. ఇప్పుడు ఈ హిట్‌ డైరెక్టర్‌ సాయి శ్రీనివాస్‌తో తీస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఈ బెల్లంకొండకు మంచి కంబ్యాక్‌ ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version