Site icon Prime9

Banda Prakash: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్‌ ఏకగ్రీవ ఎన్నిక

banda prakash

banda prakash

Banda Prakash: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్‌ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. బండా ప్రకాష్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. సీఎం కేసీఆర్‌కు బండా ప్రకాష్‌ కృతజ్ఞతలు తెలిపారు. బండా ప్రకాష్‌ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

 

బండా ప్రకాష్ ను అభినందించిన కేసీఆర్ (Banda Prakash)

శాససమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికవడం పట్ల కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. బండా ప్రకాష్‌ డిప్యూటీ ఛైర్మన్‌ కావడం అందరికీ గర్వకారణమన్నారు. సామాన్య జీవితం నుంచి బండా ప్రకాష్‌ ఎదిగారని కేసీఆర్ గుర్తు చేశారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వివరించారు. బండా ప్రకాష్‌.. 1981లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలిసారి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2017లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన కార్యదర్శిగా నియామితులయ్యారు.

శాసనమండలిలో కేటీఆర్ విమర్శలు..

శాసనమండలి సమావేశాల్లో కేంద్రంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాధించిన ప్రగతిని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 21 రోజుల్లో బిల్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నామని.. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని కేటీఆర్ అన్నారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత రైతులకు మేలు చేకూరిందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని అన్నారు. తర్వలో లక్డీకాపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు మూడో దశ ప్రాజెక్ట్‌ చేపడుతామని తెలిపారు.
తెలంగాణపై కేంద్రం కనికరం చూపించడం లేదన్నారు.

బస్తీ దవఖానాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. బస్తీ దవఖానాలు సమర్ధవంతంగా పని చేయడంతో.. ఉస్మానియా, ని​మ్స్‌ ఆస్పత్రులకు రోగుల తాకిడి తగ్గిందని తెలిపారు. త్వరలో బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్‌ సేవలు అమలు చేస్తామని హరీష్ రావు అన్నారు.

ఇంటిగ్రెటేడ్ మార్కెట్లపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఇంటిగ్రెటేడ్ మార్కెట్లపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో.. మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అధునాతన కూరగాయాల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేటితో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar