Site icon Prime9

Veera Simhareddy : హెలీకాఫ్టర్‌లో బాలకృష్ణ.. ఒంగోలులో వీరసింహారెడ్డి ఎంట్రీ

balakrishna and sruthi haasan arrrived to ongole and pictures goes viral

balakrishna and sruthi haasan arrrived to ongole and pictures goes viral

Veera Simhareddy : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నేడు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.

మొదట ఒంగోలులోని ఏఎంబీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఏపీలో నెలకొన్న జీవో నెంబర్ 1 కారణంగా భారీ సభలకు పర్మిషన్ రిజెక్ట్ చేస్తుండటంతో వీరనరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఈ ప్రభావం పడింది. అయితే ఒంగోలులోని ఏఎంబీ గ్రౌండ్స్‌లో పలు కారణాల రీత్యా ఈ వేడుకకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్థలాన్ని మాత్రమే మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే భారీ ఏర్పాటరు చేసిన మేకర్స్ … అదిరిపోయే రేంజ్ లో వెదుకను చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నారులను, వృద్దులను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావొద్దని మూవీ టీమ్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ఊహాగానాలు కూయ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి, మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే బాలకృష్ణ శృతి హాసన్ ఒంగోలు చేరుకున్నారు. బాలకృష్ణ హెలికాప్టర్ లో వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version