Site icon Prime9

Balagam Movie : అంతర్జాతీయ అవార్డు వేడుకలో అవార్డుల పంట పండించిన బలగం మూవీ.. ఏకంగా 9 విభాగాల్లో!

balagam movie receives 9 awards in french international film festival

balagam movie receives 9 awards in french international film festival

Balagam Movie : ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ పల్లె జీవితాలను, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న చిత్రంగా రిలీజ్ అయినప్పటికీ.. పెద్ద రేంజ్ లో హిట్ సాధించింది. పేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా. కాగా ఇప్పటికే బలగం సినిమాకి లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, యుక్రెయిన్ ఒనికో అవార్డ్స్, వాషింగ్టన్ డీసీ సినిమా ఫెస్టివల్ అవార్డ్స్, అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డులలో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. దీంతో సినిమాని మరిన్ని ఫిలిం ఫెస్టివల్స్, అవార్డులకు పంపిస్తున్నారు. తాజాగా ఓ ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా ఏకంగా 9 విభాగాల్లో అవార్డులు సాధించింది.

ఇటీవల ప్రకటించిన ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా 9 విభాగాల్లో అవార్డులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ మూవీ. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో

(Balagam Movie) ఏ ఏ విభాగాల్లో అవార్డులు సాధించిందో మీకోసం ప్రత్యేకంగా..

బెస్ట్ ప్రొడ్యూసర్ ఫీచర్ ఫిలింకు గాను హన్షిత, హర్షిత్

డెబ్యూట్ ఫిలిం మేకర్ క్రిటిక్స్ ఛాయస్ కి గాను డైరెక్టర్ వేణు

బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిలింకు గాను ప్రియదర్శి

బెస్ట్ యాక్ట్రెస్ ఫీచర్ ఫిలింకు గాను కావ్య కళ్యాణ్ రామ్

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫీచర్ ఫిలింకు గాను రూప లక్ష్మి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫీచర్ ఫిలింకు గాను భీమ్స్ సిసిరోలియో

బెస్ట్ ఎడిటర్ ఫీచర్ ఫిలింకు గాను చింతల మధు

బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫీచర్ ఫిలింకు గాను ఆచార్య వేణులకు అవార్డులు వరించాయి.

 

దీనిపై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. పలువురు చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. ఇక బలగం సినిమాని ఆస్కార్ అవార్డుకు కూడా పంపిస్తామని దిల్ రాజు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి బలగం సినిమా భవిష్యత్తులో ఇంకెన్ని అవార్డులు సాధిస్తుందో చూడాలి.

 

 

 

Exit mobile version