Site icon Prime9

Balagam Mogiliah: విషాదం.. ‘బలగం’ మొగిలయ్య కన్నూమూత

Balagam Mogiliah Died: ప్రముఖ జానపద కళాకారుడు, ‘బలగం’ మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసా విడాచారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందడమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్‌ అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమాతో మొగిలయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరణించారు. ఆయన మృతికి బలగం మూవీ నిర్మాతలు, డైరెక్టర్‌ వేణు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బలగం సినిమా క్లైమాక్స్‌లో మొగిలయ్య క్లైమాక్స్‌లో భావోద్వేగపూరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నారు. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా పలు ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ కూడా దక్కించుకుంది.

బలగం మంచి విజయం సాధించడంతో మొగిలయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనను తెలంగాణ ప్రభుత్వం పొన్నం సత్తయ్య అవార్డతో సత్కరించింది. అయితే కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం మెగాస్టార్‌ చిరంజీవి, బలగం డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం అందించారు. అలాగే తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఇటీవల ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

Exit mobile version