Prime9

Uttar Pradesh :యూపీలో కలిసిపోయిన బాబాయ్ – అబ్బాయ్

Uttar Pradesh: ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తామిద్దరం కలిసి పోటీ చేస్తామని కూడా ఆయన ధృవీకరించారు. ఈ సందర్బంగా మీడియాతో శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశామని.. 2024లో ఐక్యంగా పోరాడుతామని చెప్పారు.ఈరోజు నుండి, సమాజ్ వాదీ పార్టీ జెండా (కారుపై) ఉంటుందని అన్నారు.

అఖిలేష్ యాదవ్ తన పార్టీ జెండాను శివపాల్ సింగ్ యాదవ్‌కు అందించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటావా జిల్లాలోని సైఫాయ్‌లో అఖిలేష్ మరియు శివపాల్ ఇద్దరూ కలిసి కూర్చున్నారు, అక్కడ అఖిలేష్ యాదవ్ శివలాల్ పాదాలను తాకి, తన పార్టీ జెండాను అతనికి బహుకరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శివపాల్ కారుపై ఎస్పీ కార్యకర్తలు పార్టీ జెండాను కూడా ఉంచారు. ఇలా ఉండగా మైన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికలో అఖిలేష్ భార్య, ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ రెండు లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు.

Exit mobile version
Skip to toolbar