Site icon Prime9

Telangana Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?

assembly-approves-eight-bills

Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం సద్దుమణగడంతో.. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయసభలను ఉద్దేశించి.. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. శుక్రవారం మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ ప్రసంగం చేయనున్నారు.

సద్దుమణిగిన వివాదం..

ఫిబ్రవ‌రి 3వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి శుక్రవారం గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ ప్రసంగించ‌నున్నారు.

ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసన మండలి, అసెంబ్లీ సంయుక్త సమావేశానికి గవర్నర్‌ అనుమతి ఇచ్చారు.

హై కోర్టు సూచనతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య మధ్య రాజీ కుదిరింది.

ప్రభుత్వంపై ఎలాంటి దురుద్దేశాలు లేవని రాజ్‌భవన్‌ న్యాయవాది పేర్కొనగా.. గవర్నర్‌ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

ప్రభుత్వం- రాజ్ భవన్ మధ్య రాజీ

హై కోర్టు సూచన మేరకు.. ఈ వివాదం ముగిసిపోయింది. గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని రాజ్ భవన్ న్యాయవాది తెలిపారు.

ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించామని.. వివరణ కోరితే ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు.

సంప్రదాయబద్ధంగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని తెలిసి కూడా.. ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ (Governer )ప్రసంగిస్తారు.

కొత్త సమావేశాలుగా కాకుండా గత సమావేశాలకు కొనసాగింపుగానే ఉభయసభలు సమావేశం కానున్నాయి.

ఎనిమిదో సెషన్‌కు సంబంధించిన నాలుగో విడతగా అసెంబ్లీ సమావేశం కానుంది. 18వ సెషన్‌కు సంబంధించిన నాలుగో విడతగా కౌన్సిల్ సమావేశం కానుంది.

ఇక ఫిబ్రవరి 6వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

ఇప్పటికే బడ్జెట్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపిన ప్రభుత్వం.

బడ్జెట్ కు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళి సై.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version