Site icon Prime9

Ashok Galla: ఆసక్తి పెంచుతున్న అశోక్‌ గల్లా’ దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్‌

Devaki Nandana Vasudeva Trailer Out: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తున్న లేటస్ట్‌ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అశోక్‌ గల్లా ఇప్పటికేగా హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ‘హీరో’ మూవీతో డెబ్యూ ఇచ్చిన అది ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఇక లాంగ్‌ గ్యాప్‌ తర్వాత అతడు నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. దానికి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్ట్స్‌, టీజర్స్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. నవంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు యాక్టన్‌ ప్యాక్ట్‌గా ట్రైలర్‌ను మలిచారు. ఈ భూమ్మిద ఎక్కడ లేని విధంగా సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అనే బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత యాక్షన్‌ ఫైట్‌తో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హీరోకి దైవ కోణం ముడిపెట్టినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌తో తీర్చిదిద్దిన ఈ ట్రైలర్‌ ఆద్యాంతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మూవీ మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది.

కాగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్‌ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. బీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో అశోక్‌ సరసన మోడల్‌ మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నారు. నిజానికి నవంబర్‌ 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం కంగువా, మట్కా వంటి భారీ సినిమా విడుదల కారణంగా వాయిదా పడింది. దీంతో నవంబర్‌ 22న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే అశోక్‌ గల్లా ఇప్పటికే హీరో సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అశోక్‌ ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్ అయ్యింది.

Exit mobile version