AP High Court On Ram Gopal Varma Case: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తుగా ఇచ్చిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కేసులు కొట్టేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు వేశారు. అయితే, తాజాగా, విచారణ చేపట్టిన హైకోర్టు ఆయననున అరెస్ట్ చేయకూడదని చెప్పడంతో ఊరట లభించినట్లయింది. కాగా, తదుపది విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
అయితే, ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై అసభ్యంగా ప్రవర్తించడంతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఆయనకు పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని చెప్పడంతో వర్మ హాజరుకాలేదు. దీంతో నెల్లూరు పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆర్జీవీ అందుబాటులో లేకపోవడంతో మళ్లీ నోటీసులు అందజేశారు.
కాగా, తనపై పోలీసులు రాజ్యాంగ విరుద్ధ:గా కేసు పెట్టినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు తనపై కేసు నమోదు చేశారన్నారు. తనపై కేసు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు పిటిషన్ పెట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా, ఆర్జీవీపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించాడు. నేను పారిపోలేదని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నానని చెప్పాడు. అయితే కావాలనే కొంతమంది తనపై 5 కేసులు పెట్టారని, దీన్నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని వివరించాడు. సోషల్ మీడియాలో తను పెట్టే ట్వీట్స్ వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు.