Site icon Prime9

AP Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్‌ శాఖ పనులపై పవన్‌ ప్రత్యేక దృష్టి.. నేడు కృష్ణా జిల్లాలో పర్యటన

AP Deputy CM Pawan Kalyan visit to krishna district today: నేడు కృష్ణా జిల్లాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పర్యటించి, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.

అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను తనిఖీ చేస్తారని డిప్యూటీ సీఎం కార్యాలయం పేర్కొంది. పంచాయతీరాజ్‌ శాఖ పనులపై పవన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసే దిశగా పర్యటిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు పనుల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. ఇటీవల మన్యం జిల్లాల్లో డిప్యూటీ సీఎం పర్యటించారు.

Exit mobile version