Site icon Prime9

AP CM Chandrababu: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. ధాన్యంపై రైతులతో చర్చ

AP CM Chandrababu’s visit to Krishna district: కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు గంగూరు రైతు సేవా కేంద్రం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇక నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా స్వయంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వివరించారు. అధికారుల నుంచి డాక్యుమెంటేషన్ కాదని అన్నారు. రైతులకు మరింత సేవలు అందించేలా చొరవ తీసుకోవాలని చెప్పారు. రైతుల విషయంలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తేమ శాతం, ఇతర అంశాల్లోనూ కచ్చితత్వం ఉండాలని చెప్పారు. అనంతరం రైతులకు తానే స్వయంగా ఐవీఆర్ఎస్‌పై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఎలా ఉందనే విషయం చెప్పాలని సూచించారు.

Exit mobile version