AP CM Chandrababu Meeting With Bill Gates In Davos: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మైక్రోస్టాప్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు.
ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. దీంతో పాటు ప్రకృతి వ్యవసాయం, హ్యుమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఇప్పటికేు గ్రీన్ కోతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోనుంది.