Site icon Prime9

AP CID Chief: ఎస్పి బాటలోనే ఏపీ సీఐడీ చీఫ్

AP CID Chief

AP CID Chief: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు.

వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా?.. కాదా?.. అనే విషయం ఆ ల్యాబ్ చెప్పలేదని డీజీ సునీల్ కుమార్ అన్నారు.మన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు. మార్ఫింగ్‌ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందన్నారు. ఎక్లిప్స్ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతున్న నివేదిక తనది కాదని స్టాఫర్డ్ తనకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారన్నారు.

సర్కులేషన్లో ఉన్న వీడియో ఒరిజనలేనని మాత్రమే ఎక్లిప్స్ సంస్థ చెప్పిందన్నారు. ఓ స్క్రీన్ మీద రన్ అవుతోందన్న దాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చరన్నారు. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్నారు

Exit mobile version