Miss Shetty MR Polishetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో ‘మిర్చి’, ‘భాగమతి’, తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.. నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ‘భాగమతి’ తర్వాత అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా చేశారు. అయితే, ఆ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారికల్ సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’లో ఝాన్సీ లక్ష్మీ బాయి రోల్ చేశారు. అందువల్ల, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక టీజర్‌లో అనుష్క పేరు పొందిన షెఫ్ గానూ, నవీన్ పోలిశెట్టిని స్ట్రగులింగ్ స్టాండప్ కమెడియన్‌గానూ చూడవచ్చు. అనుష్కకు పెళ్లి చేయడం తన తల్లికి (జయసుధ) అస్సలు ఇష్టం లేదు. అయితే అనుకోకుండా నవీన్ పోలిశెట్టి, అనుష్క కలవాల్సి వస్తుంది. వారి మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను ఈ టీజర్‌లో చూడవచ్చు. కానీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారా లేదా అన్న విషయం మాత్రం రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ముఖ్యంగా అనుష్క.. నవీన్ ను ఇంటర్వ్యూ చేస్తూ.. నీ స్ట్రెంత్ ఏంటీ అని అడుగుతుంది.. అందుకు నవీన్ ‘అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా’ అని చెబుతాడు.. వీక్ నెస్ గురించి అడిగితే.. ‘సిట్యుయేషన్ కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా’ అని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. చివర్లో నీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా అని అడిగితే కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడమ్ అని చెప్పడం నవీన్ మార్క్ కామెడీతో సినిమా సాగుతుందని అర్థమవుతుంది.
5 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి జేజమ్మ Miss Shetty MR Polishetty..
కాగా అనుష్కకు ఇది 48వ చిత్రమిది. సుమారు ఐదేళ్ళ తర్వాత అనుష్క శెట్టి నుంచి థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. అదే విధంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ డిజిటల్ రైట్స్‌ను ‘జీ’ గ్రూప్ కొనుకోలు చేసింది. అనుష్క గత చిత్రాలైన ‘భాగమతి’ హిందీ, తమిళ వెర్షన్స్ ‘జీ 5’లో ఉన్నాయి. ‘సైజ్ జీరో’ తెలుగు వెర్షన్ కూడా ‘జీ 5’లో వీక్షకులకు అందుబాటులో ఉంది. మొత్తానికి ఈ సినిమాతో అనుష్క గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.