Site icon Prime9

Former Minister KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ.. ఏసీబీకి మరో ఫిర్యాదు..

Another Big Shock to Former Minister KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్‌పై క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్‌పై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. అలాగే ఈడీకి కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్‌పై ఫిర్యాదు చేసింది. కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌పై కూడా ఈడీకి ఫిర్యాదు అందింది.

కాగా, న్యాయవాదిని అనుమతించడం కుదరదని ఏసీబీ చెబుతోంది. న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్దమని చెప్పింది. న్యాయవాదిని అనుమతించేదని సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించింది. విచారణకు హాజరైన తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది తర్వాత చెబుతామని వివరించింది. అలాగే డాక్యుమెంట్లు సమర్పించేందుకు గడువు ఇస్తామని, విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. న్యాయవాదితో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయవాదిని అనుమతించే ప్రసక్తేలేదని చెప్పింది. విచారణను న్యాయవాది చూసే అవకాశం ఏసీబీలో ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది.  సాయంత్రం 4 గంటలులోగా చెబుతామని ఏఏజీ తెలిపింది. ముగ్గురు న్యాయవాదు పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని హైకోర్టు అడిగింది. అనంతరం తదుపరి విచారణను 4 గంటలకు వాయిదా వేసింది.

మరోవైపు, రేవంత్ రెడ్డి పెట్టించిన ఈ లొట్టపీసు కేసుకు తాను భయపడనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్ మాట్లాడారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. డ్రామా, లగచర్ల బాధితులతో పోలిస్తే మనది పెద్ద ఇబ్బందా? అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టే సమయంలో వచ్చిన ఇబ్బందుల కంటే ఇవేం పెద్ద ఇబ్బందులు కావని వెల్లడిచంారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై పోరాడాలని, వారికి అందించే రైతు భరోసా, రైతురుణమాఫీపై నిలదీయాలని చెప్పారు.

Exit mobile version