New Delhi: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్రకోటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు, ముద్రా పథకం రుణగ్రహీతలు పాల్గొన్నారు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడిన వారిలో స్వచ్ఛాగ్రహ, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆటో-రిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరోవైపు భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారత నౌకాదళ యుద్ధనౌకలు ఆరు ఖండాలు, మూడు మహాసముద్రాలు మరియు ఆరు వేర్వేరు సమయ మండలాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాయి.