Site icon Prime9

Andhra Pradesh: ఏపీలో విస్తారంగా వర్షాలు

rains-in-andhra

rains-in-andhra

ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గరికిపాలెంలో 122.5 మి.మీ, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 110.5 మి.మీల వర్షపాతం నమోదైంది.

శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని సూచించింది. రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.

శుక్రవారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 60 మి.మీ నుంచి 95 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్‌, తిరుపతి, నంద్యాల, పల్నాడు, వైయస్‌ఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిశాయి.

Exit mobile version