Site icon Prime9

Anchor Lasya : ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ పంచుకున్న యాంకర్ లాస్య.. మగ బిడ్డ పుట్టాడంటూ

anchor lasya post about her new baby boy and video goes viral

anchor lasya post about her new baby boy and video goes viral

Anchor Lasya : యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలలో యాంకర్ రవి తో లాస్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మా మ్యూజిక్ లో ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత కూడా పలు షో లలో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ తో కూడా బాగా పాపులర్ అయింది ఈమె. అయితే లాస్య అంటే మొదట బుల్లితెర ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది చీమ ఏనుగు జోక్.. ఆ సిల్లీ జోకులే లాస్యకు పాపులారిటీని తీసుకువచ్చాయి. ఇప్పటికి ఏ టీవీ షోలో పాల్గొన్న చీమ ఏనుగు జోక్ చెప్పు అని అందరూ లాస్య ను ఆటపట్టిస్తూ ఉంటారు.

పెళ్లి తర్వాత కొంతకాలం షో లకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని త‌నదైన ఆట, మాట‌ తీరుతో అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత కూడా వీలు చిక్కినప్పుడల్లా పలు పండుగల ఈవెంట్ లో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది. కానీ లాస్య సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది.

ఇక ఇప్పటికే ఓ పాపకు తల్లయిన లాస్య, ఇటీవల రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల తన సీమంతం వేడుకను ఘనంగా జరుపుకోగా, ఈ వేడుకకు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు మెహ‌బూబ్, దేత్త‌డి హారిక‌, గీతూ రాయ‌ల్ సహా పలువురు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఆమె సీమంతం వేడుకల వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే తన డెలివరీ టైమ్ దగ్గరపడుతుందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన లాస్య.. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. హోలీ రోజున తనకు పండంటి బాబు పుట్టాడని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో (Anchor Lasya)..

తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లాస్య. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తమ కుటుంబంలోకి మరొకరిని ఆహ్వానిస్తున్నామంటూ లాస్య పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా ఉంది. చేతులకు రంగులు అద్దుకుని.. పుట్టింది మగబిడ్డ అంటూ షేర్ చేసింది. దీంతో లాస్యకు సెలబ్రెటీలతో పాటు ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం లాస్య పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version