Site icon Prime9

Anchor Anasuya : మళ్ళీ మొదలైన అనసూయ “ఆంటీ” వ్యవహారం.. సోషల్ మీడియాలో మరో పోస్ట్

anchor anasuya another post about aunty issue on social media

anchor anasuya another post about aunty issue on social media

Anchor Anasuya : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన “రంగమార్తాండ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా అనసూయకి – ఆంటీ అనే పద్యం వింటే చాలు అనుకుంటా బీపీ హై రేంజ్ లో పెరిగిపోతుందేమో అనేలా చెలరేగిపోతారు. నెటిజన్లు తనని ఆంటీ అని కామెంట్ చేయడం పట్ల ఇప్పటికీ పలుసార్లు వారిపై ఫైర్ అయ్యారు.. కేసులు పెట్టారు.. ఇలా నిత్యం జరుగుతూనే ఉంటుంది. దీంతో నెటిజన్లు, ట్రోలర్లు మరింత రెచ్చిపోయి ఏకంగా కొన్ని రోజులు ఆంటీ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండేలా చేశారు. కొన్ని రోజులు ఈ ఆంటీ వివాదం హడావిడి అయి ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే ఇటీవల ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు.

ఈ సారి మాత్రం అనసూయ వీటికి ఎక్కువగా స్పందించలేదు. తాజాగా ఆదివారం నాడు ఇన్‌‌స్టాగ్రామ్ లో అభిమానులతో కాసేపు ముచ్చటించిన అనసూయ పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని.. అక్కా మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడగగా.. అనసూయ సమాధానమిస్తూ.. ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ఇంపార్టెంట్, బెటర్ పనులు చాలా ఉన్నాయి అని సమాధానమిచ్చింది. అదే విధంగా మరో నెటిజన్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్. కానీ మీరు ఇప్పుడు ఇలా సైలెంట్ గా ఉండటం బాగోలేదు అని అడగగా.. థ్యాంక్యు. కానీ నేను సైలెంట్ గా లేను. జస్ట్ నా ఫోకస్ మార్చాను. మాట్లాడాల్సిన సమయంలో మళ్ళీ నేనే మాట్లాడతాను అని చెప్పింది. దీంతో మరోసారి ట్రోలింగ్స్ పై ఇండైరెక్ట్ గా అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అయితే నెటిజన్లు ప్రతిసారీ చేసే కామెంట్లు ఒక్కటే.. ఇద్దరు బిడ్డల తల్లి.. చిన్న నిక్కర్లు వేసుకొని థైస్ కనిపించేలా, నడుము కనిపించేలా, క్లివేజ్ షో చేస్తుంటే.. ట్రోల్స్ ఇలానే వస్తాయి. ఆమెతో పాటు చేసే ఇతర యాంకర్లను ఎవరూ ట్రోల్స్ చేయడం లేదు. ముందు ఆమె మంచిగా ఉండాలి అంటూ ట్రోలర్స్ చెప్పుకొస్తుండగా.. మేము ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి మీరెవరు. మాకు నచ్చినట్లు మేము ఉంటాం.. అయినా ఆంటీ అని ఎలా పిలుస్తారు.. అంటూ అనసూయ ధ్వజమెత్తింది. చేసేవి చేస్తూనే మేము ఇలానే ఉంటాం.. మీరు మాత్రం చూస్తూ కూర్చోండి అనడం కరెక్ట్ కాదని.. మహాయిల హక్కులను అడ్డం పెట్టుకొని.. ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే భావ ప్రకటన స్వేచ్చ అందరికీ ఉంటుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Exit mobile version