Anant ambani engagement: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్ మెంట్.. ప్రతీది విశేషమే

Anant ambani engagement: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ( Muikhesh ambani) ఇంట పెళ్లి సందడి మొదలైంది. అంబానీ చిన్న కూమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ కు అధికారంగా ఎంగేజ్ మెంట్ (Anant Ambani-Radhik) జరిగింది. ఈ వేడుకకు ఇద్దరి కుటుంబాలకు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ తో పాటు బీ టౌన్ సెలెబ్రెటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకను గుజరాతీ హిందూ కుటుంబాల్లోని గోల్ ధోనా, చునారీ విధి వంటి సంప్రదాయ పద్ధతులను పాటించి ఘనంగా నిర్వహించారు.

గత ఏడాది డిసెంబర్ 29 న రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలో ప్రీ ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పురాతన సంప్రదాయాలతో వేడుక

గుజరాతీ హిందూ సంప్రదాయాలను ముఖేష్ అంబానీ అడుగడునా పాటిస్తుంది. ఈ క్రమంలోనే ఈ నిశ్చిత్తార్ధ వేడుకలో పురాతన సంప్రదాయమైన గోల్ ధనా, చునారీ వంటి పద్ధతులను అనుసరించి కార్యక్రమం జరిపారు.

గోల్ ధనా అంటే బెల్లం, ధనియా గింజలు లు అని అర్ధం. వేడుకకు హాజరైన అతిథులకు వాటిని అందిస్తారు.

ముందుగా అంబానీ కుమార్తే ఇషా అంబానీ.. మర్చంట్ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించింది. అనంతరం అంబానీ నివాసానికి చేరుకున్న మర్చంట్ కుటుంబ సభ్యులు అతిధి మర్యాదలతో స్వాగతం పలికారు.

ఇరు కుటుంబాలు శ్రీ కృష్ణ మందిరంలో పూజలు చేసి ఎంగేజ్ మెంట్ కు ప్రారంభించారు. అందరి సమక్షంలో లఘ్న పత్రిక ను చదివి వినిపించారు.

తర్వాత రాధిక, అనంత్ అంబానీలు రింగ్స్ మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం నీతా అంబానీ నేతృత్వంలో కుటుంబ సభ్యులు చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలచాయి.

స్పెషల్ అట్రాక్షన్ గా గోల్డెన్ రిట్రీవర్

అనంత్ , రాధిక ల ఎంగేజ్ మెంట్ సెర్మనీలో ఎంతో మంది సెలబ్రెటీలు ఉన్నా స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రం గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ కు చెందిన కుక్క నిలిచింది.

ఈ కుక్కను ముఖేష్ ఫ్యామిలీ పెంచుకుంటోంది. వేడుకలో భాగాంగా రింగ్ మార్చుకునే కార్యక్రమంలో ఇషా అంబానీ ఈ కుక్కను రింగ్ బేరర్ గా ఆహ్వానించింది.

ఇషా పిలవగానే ఈ డాగ్ క్యూట్ గా వాక్ చేసుకుంటూ వచ్చింది. ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న బాక్స్ ను తీసుకొచ్చి అనంత్ కు అందజేసి అతిథులను ఆకట్టుకుంది.

 

సందడి చేసిన బీటౌన్ సెలబ్రిటీలు

అంగరంగ వైభవంగా జరిగిన అనంత్, రాధిక ఎంగేజ్ మెంట్ లో బాలీవుడ్ సెలబ్రెటీలు సందడి చేశారు.

ఐశ్వర్య రాయ్, షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, దీపికా పడుకోన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ లతో పాటు పలువురు బీటౌన్ ప్రముఖలు పాల్గొన్నారు.

 

కాగా, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ లో చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Ananth ambani) యూఎస్ లోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నాడు.

తర్వాత రిలయన్స్ ఇండ్రస్ట్రీలో జియో ప్లాట్ ఫామ్ బోర్డుల, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మెంబర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్ఐఎల్ ఆయిల్ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు.

వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ల కుమార్తె రాధిక మర్చంట్. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ప్రస్తుతం ఆమె ఎన్ కోర్ హెల్త్ కేర్ బోర్డ్ లో డైరెక్టర్ గా ఉన్నారు.

2019 లోనే ఇరు కుటుంబాలు అనంత్, రాధిక ల వివాహాన్ని ఖాయం చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/