Pushpa 2 Tickets Rates Reduced: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దూకూడు మామూలుగా లేదు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం అంతకుమించి రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్స్‌తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లతో విధ్వంసం సృష్టిస్తుంది. మూడు రోజుల్లో రూ. 600పైగా కోట్ల గ్రాస్ రాబట్టిన ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో పుష్ప 2 థియేటర్లో హౌజ్‌ఫుల్ బోర్డు కనిపిస్తుంది. నాలుగొవ రోజే ఈ మూవీ 700 కోట్ల గ్రాస్ చేసి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోయేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే పుష్ప 2 మూవీకి టికెట్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ఆడియన్స్ మల్టిప్లెక్స్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో వారందరిని ఖుషి చేసే ఓ వార్తల బయటకు వచ్చింది.
రేపటితో పుష్ప 2 విడుదలై రెండో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలో మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు భారీగా టికెట్ ధరలు తగ్గించినట్టు తెలుస్తోంది. మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత రవిశంకర్ టికెట్ ధరల తగ్గింపును విషయాన్ని ప్రస్తావించారు. ఇది విని సామాన్య ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను భారీగా తగ్గించారు. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఒక్క టికెట్ ధరపై రూ. 100, రూ. 150 వరకు తగ్గాయి. రేపటి నుంచి ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బుక్కింగ్ సైట్స్‌లో తగ్గించిన ధరలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా సెకండ్ క్లాస్ రూ. 80, ఫస్ట్ క్లాస్ రూ. 140, బాల్కనీ రూ. 200గా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ధరలు కూడా బుక్కింగ్ సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక పుష్ప 2 టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో రెండో వారంలోనూ పుష్ప 2 జోరు మరింత పెరిగేలా కనిపిస్తుంది. టికెట్ రెట్ల తగ్గింపుతో రెండో వారంలోనూ పుష్ప ఇదే జోరు కనబరిచేలా ఉందని, ఈ దెబ్బతో సెకండ్ వీక్‌లోనే పుష్ప 2 వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచన వేస్తున్నాయి.