Site icon Prime9

Akkineni Naga Chaitanya : ఆమె నా క్రష్.. బ్రేకప్ తర్వాత అలా అంటే చిరాకు వస్తుంది – నాగ చైతన్య

akkineni naga chaitanya comments about his crush and break up

akkineni naga chaitanya comments about his crush and break up

Akkineni Naga Chaitanya : జోష్ సినిమాతో తెలుగు తెరకు అక్కినేని వారసుడిగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఏ ఏయంగ్ హీరో. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న చైతూ.. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు. అలానే   ఇక ఏం మాయ చేసావే సినిమాతో ఏర్పడిన సమంత – నాగ చైతన్యల పరిచయం.. అనంతరం ప్రేమగా మారి.. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. దీంతో గత సంవత్సరం కాలంగా నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. సమంతతో విడిపోయిన తర్వాత చైతు ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ శోభిత ధూళిపాళతో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ బయటకి రావడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. దీంతో మీడియాలో వీరిద్దరి గురించి హాట్ టాపిక్ నడిచింది. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం “కస్టడీ” మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుండగా.. బంగార్రాజు తర్వాత రెండో సారి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందిన చిత్రానికి ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా కంబైన్డ్‌గా మ్యూజిక్ ఇచ్చారు. మే 12న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు చైతూ. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి, బ్రేకప్ తర్వాత పరిస్థితి గురించి నోరు విప్పాడు. చైతన్య మాట్లాడుతూ.. నా క్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు. హాలీవుడ్ యాక్ట్రెస్ మార్గట్‌ రోబీ పై నాకు చాలా క్రష్ ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన బేబీ లాన్ సినిమా చూశాను. ఆ మూవీలో తన నటనకి ఫిదా అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. అలానే యాంకర్.. రెండున్నరేళ్ల క్రితం తాను లవర్‌తో విడిపోయినట్లు చెప్పాడు. కానీ మంచి ఫ్రెండ్స్‌గా ఉండొచ్చని ఆమె సూచించిదని అన్నాడు. అయితే అతని స్టేట్‌మెంట్‌కు వెంటనే స్పందించిన చైతన్య.. ‘మనం మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం’ అనే మాట తనను ఎక్కువగా ఇరిటేట్ చేస్తుందన్నాడు. తాను ఎవరినీ ఫ్రెండ్‌షిప్ కోసం అడగలేదని చెప్పాడు. ప్రస్తుతం చైతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక మరో ఇంటర్వ్యూలో తన జీవితంలో పశ్చాత్తాపపడ్డ సంఘటనని షేర్ చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లో పెద్దగా పశ్చాత్తాపపడ్డ సంఘటనలు ఏమి లేవు గాని ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం అలా ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. మూడు సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోయానని పశ్చాత్తాప పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version