Site icon Prime9

75th Independence Day: ఐబి హెచ్చరికలు.. ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

New Delhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు. దీని కోసం ప్రత్యేకంగా 400 మంది పోలీసులను నియమించారు.

ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలను అదుపులోకి తీసుకుని వాటిపై ఈగల్ స్క్వాడ్ షూటర్స్‌ను మోహరించనున్నారు. ఎర్రకోట చుట్టూ అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేనున్నారు. మరో వైపు ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేసి, తనిఖీలు చేపట్టనున్నారు. 15న రోహింగ్యాల కాలనీల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆయా కాలనీ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

Exit mobile version