Adulterated liquor In Hyderabad : హైదరాబాద్‌లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న వార్త గందరగోళానికి దారి తీస్తుంది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లాంటి శివారు ప్రాంతాల్లో నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా జరిపిన ఈ విచారణలో విస్తుపోయే నిజాలు తేలినట్లు తెలుస్తుంది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మందు బాబులంతా షాక్ లో ఉన్నారు. త్రాగుబోతులకు ఈ చేదు వార్త మిందుగు పడడం లేదని చెప్పాలి. ఆఖరికి ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికకు కూడా హైదరాబాద్ నుంచి ఈ నకిలీ మందునే సరఫరా చేసినట్టు సమాచారం అందుతుంది. ఈ ఉదంతం నగర శివారు లోని ఓ చిన్న బెల్ట్ షాపు ద్వారా బయటపడటం గమనార్హం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు…
నగర శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సాధారణ పౌరులు లాగా వెళ్ళి… మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని పరిక్షించగా అవి నకిలీవిగా గుర్తించారు. ఇక ఆ బెల్ట్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఈ దందా గుట్టువిప్పాడు.
ఏ ఏ ఏరియాల్లో అంటే…
ఆ సమాచారంతో పెద్దఅంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌ని పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన మద్యం వ్యాపారి బింగి బాలరాజు గౌడ్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంటనే బింగి బాలరాజు గౌడ్‌ను అదుపులోకి తీసుకోగా… మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ ఏరియాల్లో సుమారు రెండు కోట్లకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ తరహాలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న లిక్కర్ షాప్స్, బార్లు, పబ్ లలో కూడా త్వరలోనే తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.