Site icon Prime9

Adani Group: నిజాలు బయటపడతాయి.. సత్యమే గెలుస్తుంది: అదానీ

adani

adani

Adani Group: గౌతమ్ అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతం అదానీ రియాక్ట్ అయ్యారు. ‘సమయాను కూలంగా నిజాలు బయట పడతాయని.. సత్యమే గెలుస్తుంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా అదానీ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు.

సెబీకి ఆదేశాలు(Adani Group)

కాగా, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది.

అదానీ గ్రూప్‌ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.

సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ రేట్స్ లో ఏవైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని తెలిపింది.

రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని.. ఆరుగురు నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే.

విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సప్రే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

 

 

6గురు సభ్యుల ప్యానెల్

ఈ కమిటీలో బ్యాంకింగ్ దిగ్గజాలు కేవీ కామత్, ఓపీ భట్ , ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్ లు ఉన్నారు.

పెట్టుబడి దారులకు రక్షణ కల్పించడం, వ్యవస్థలోని లోపాలను సరిచేయడం వంటి అంశాలపై ప్యానెల్ కీలక సూచనలు చేయనుంది.

ఈ ప్యానెల్ కు అన్ని విధాలా సహకారాన్ని అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్ పర్సన్ బెంచ్ ఆదేశించింది.

కాగా అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలన్నింటినీ అదానీ కొట్టి పారేశారు.

హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ గతంలోనే అదానీ గ్రూపు 413 పేజీల ప్రతి స్పందనను రిలీజ్ చేసింది.

హిండెన్‌బర్గ్ ,వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సెబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి మరో ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్‌లో కోరారు.

దీంతో పాటు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, ఒకసామాజిక కార్యకర్త కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.

Exit mobile version
Skip to toolbar