Site icon Prime9

Ileana : తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన గోవా బ్యూటీ ఇలియానా.. “అరే ఎప్పుడు రా” అంటూ నెటిజన్లు కామెంట్స్

actress ileana post about pregnancy got viral

actress ileana post about pregnancy got viral

Ileana : దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ” ఇలియానా “. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్‍లో దూసుపోయింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఉన్నట్టుండి ఇలియానా బొద్దుగా మారడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్లీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది.

అయితే ఇటీవల కాలంలో.. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాకుండానే పిల్లల్ని కనటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం సాధారణం అయింది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇలియానా కూడా చేరినట్లు తెలుస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో తాను తల్లి కాబోతున్నట్లు ఒక షాకింగ్ పోస్ట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇలియానా.

ఈ మేరకు ఇన్ స్టా వేదికగా అండ్‌ సో ది అడ్వెంచర్‌ బిగిన్స్`(ఇక సాహసయాత్ర ప్రారంభమవుతుంది) అని రాసి ఉన్న చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అని ఉన్న చైన్‌ని షేర్‌ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ” కమింగ్‌ సూన్‌, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను” అని రాసుకోచ్చింది. దీంతో ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ ఊహించని వార్తతో ఆమె ఫ్యాన్స్ అంతా ఏం మాట్లాడున్నారు మేడమ్ నరాలు కట్ అయిపోతున్నాయ్ అంటూ షాక్ లో ఉన్నారు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అంతా ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతూ.. “అరే ఎప్పుడు రా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా? లేక ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా ప్రయోగాలు చేస్తుందా? అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది మత్రం ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.

కాగా కొద్ది రోజుల క్రితమే ఓ మ్యూజిక్ వీడియో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇలియానా. పాపులర్ ర్యాపర్ బాద్‌షా మ్యూజిక్ వీడియోలో ఇలియానా తళుక్కుమంది. ‘సబ్ గజాబ్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో ఇలియానా చాలా చబ్బీ గా కనిపించింది. అంతేకాకుండా తన ట్రేడ్ మార్క్ బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపింది. తనలో మునుపటి గ్రేస్ ఎక్కడా తగ్గలేదని నిరూపించింది. ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.

Exit mobile version