Site icon Prime9

Actress Bindu Madhavi : త్రిష మాజీ లవర్ తో డేటింగ్ చేస్తున్న బిందు మాధవి.. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసిందిగా !

actress bindu madhavi opens on her releationship

actress bindu madhavi opens on her releationship

Actress Bindu Madhavi : తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో అడుగు పెట్టి ఓటీటీ ప్రేక్షకులందరినీ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కాగా ఇటీవలే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తన సొంతం చేసుకుంది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం ఈ అమ్మడుకు మరింత అభిమానం పెరిగింది.

ఇక బిందు మాధవి బిగ్ బాస్ తరువాత మళ్లీ ఫామ్‌ లోకి వచ్చేసింది. వరుస వెబ్ సిరీస్‌లతో సత్తా చూపిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా నవదీప్ తో కలిసి ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మే 12 న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఊహించని రీతిలో తన రిలేషన్ షిప్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది బిందు మాధవి.

ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్.. నవదీప్, బింధు మాధవిలపై ఇప్పటి వరకూ వార్తల్లో వచ్చిన గాసిప్‌లను ఒక్కొక్కటిగా చదువుతూ.. నిజమా? కాదా? అని అడిగింది. త్రిష బాయ్ ఫ్రెండ్‌తో మీరు డేటింగ్‌లో ఉన్నారనే రూమర్ వచ్చింది? అది నిజమా కాదా? అని బిందుని అడగడంతో.. దాటవేత ధోరణిలో కాకుండా చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చింది ఈ భామ. ఔను నిజమే.. కానీ.. వేరు వేరు సందర్భాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిష‌తో బ్రేకప్ అయిన తరువాత నాతో డేట్. నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది బిందు మాధవి. ప్రస్తుతం ఉన్న హీరో హీరోయిన్లలో చాలా వరకు ఎవరూ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వరు. కానీ వాళ్లలా కాకుండా.. తన రిలేషన్ షిప్ గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం పట్ల ఆమె ఫ్యాన్స్ అంతా సంతోషిస్తున్నారు.

ఇకపోతే త్రిష కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ మణియన్ ని ప్రేమించిన విషయం తెలిసిందే. అతనితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన ఆ బ్యూటీ.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకుంటుండగా.. అనూహ్యంగా వాళ్లిద్దరు విడిపోయారు. తమ పెళ్లిని రద్దు చేసుకొని.. ఎవరు పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే.. వరుణ్ మణియన్, బిందు మాధవి కలిసి వెకేషన్స్‌కి, పార్టీలకు వెళ్లడం.. ఆయా ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారమూ జరిగింది. అయితే.. బిందు మాధవి కానీ వరుణ్ మణియన్‌ కానీ ఈ విషయం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. ఇప్పుడు సడన్ గా ఓపెన్ అయ్యే సరికి అంతా దెబ్బకి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. బిందు మాధవి చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version
Skip to toolbar