Site icon Prime9

Actor Vikram : తంగలాన్ మూవీ షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ విక్రమ్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

actor vikram got seriously injured in thangalaan movie shoot

actor vikram got seriously injured in thangalaan movie shoot

Actor Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో తన పాత్ర కోసం.. ఆయన ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక ఇటీవలే విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ షూటింగ్ లో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారన తెలుస్తుంది. షూటింగ్ రిహార్సల్స్ లో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారన సమాచారం అందుతుండగా.. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయన పక్కటెముక ఒకటి విరిగిందని వెల్లడించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విక్రమ్ కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ మీడియాకు తెలిపారు.

కాగా ఈ విషయం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని ఏళ్ళ క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. విక్రమ్ కు ప్రమాదం జరగడంతో ప్రస్తుతం షూటింగ్ ఆపేశారు. విక్రమ్ కోలుకున్నాకే మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది. గతంలో కూడా ఇదే సినిమా సెట్ లో విక్రమ్ కు ప్రమాదం జరిగి కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. దీంతో విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి విక్రమ్ కు హాస్పిటల్ లో చికిత్స ప్రారంభించినట్లు సమాచారం.

 

ఇటీవల విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో విక్రమ్ ఎలా చేంజ్ ఓవర్ అయ్యాడు, ఎలా మేకప్ వేసుకున్నాడు. తన పాత్ర కోసం ఎలా రెడీ అయ్యాడో చూపించారు. విక్రమ్ తో పాటు అతని చుట్టూ పక్కల ఉన్నవాళ్ళని కూడా చూపించారు. అలాగే షూటింగ్ ని అడవుల్లో, నీళ్ళల్లో, రాళ్ళల్లో ఎలా తీస్తున్నారు, యుద్ధ సన్నివేశాలను ఎలా తీశారో చూపించారు. ఈ వీడియోలో విక్రమ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Exit mobile version