Site icon Prime9

Viral News: అప్పు కట్టలేదని.. స్కూటర్ కి కట్టేసి లాక్కెళ్లారు..!

young boy in odissa

young boy in odissa

Viral News: ఒడిశాలో దారుణం జరిగింది. అప్పు చెల్లించలేదని ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి స్కూటర్‌తో లాక్కెళ్లారు కొందరు యువకులు ఈ ఘటన కటక్‌లో జరిగింది.

ఒడిశా కటక్ నగరంలో బిజీగా ఉండే రోడ్డుపై కొందరు వ్యక్తులు ఓ యువకుడిని బైక్ కు కట్టేసి లాక్కెళ్లిన ఘటన జరిగింది. దాదాపు అతన్ని రెండు కిలోమీటర్ల దూరం అలానే తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన తమకు రాత్రి 11 గంటల సమయంలో సమాచారం అందినట్లు కటక్‌ డీసీపీ పినాక్‌ మిశ్రా తెలిపారు. కాగా దీనికి సంబంధించిన నిందితుల్ని, బాధితుడిని గుర్తించామని పోలీసులు వెల్లించారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

బాధితుడిని జగన్నాథ్‌ బెహరాగా పోలీసులు గుర్తించారు. అతను నిందితుడి వద్ద నుంచి 1500 అప్పు తీసుకున్నాడని అయితే అనుకున్న సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడని దానితో ఆగ్రహించిన నిందితులు జగన్నాథ్ను స్కూటర్‌కు కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

ఇదీ చదవండి: భార్య మార్పిడి క్రీడ.. కీచకుడిగా మారిన భర్త..!

Exit mobile version