Site icon Prime9

Trains Cancelled: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు – 31 రైళ్లు రద్దు.. అవేంటంటే!

Train Derailed at Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉత్తరప్రదేశలోని ఘజియాబాద్‌కు 44 బోగీలతో గూడ్స్ రైలు ఐరన్ రోల్స్ తో వెళ్తుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల రైల్వే గేట్‌కు సమీపంలో మంగళవారం రాత్రి ఈ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు బోల్తా పడినట్టు సమాచారం. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో బోగీల మధ్య ఉన్న లింక్‌లు తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొననారు. ఈ సంఘటనలో మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయి. ఘటన స్థలంకు చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

ఈ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లను రద్దు చేయడంతోపాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, నర్సాపూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – కాగజ్ నగర్, కాజీపేట – సిర్పూర్ టౌన్, సికింద్రాబాద్ – నాగపూర్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్, కరీంనగర్ – బోధన్, భద్రాచలం రోడ్ – బల్లార్షా, యశ్వంత్ పూర్ – ముజఫర్ పూర్, కాచిగూడ – నాగర్ సోల్, బల్లార్షా – కాజీపేట, కాచిగూడ – కరీంనగర్, అదిలాబాద్ – నాందేడ్, సికింద్రాబాద్ – తిరుపతి, అకోలా – పూర్ణ, సికింద్రాబాద్ – రామేశ్వరం, , అదిలాబాద్ – పర్లి, నిజామాబాద్ -కాచిగూడ, గుంతకల్లు – బోధన్ రైళ్లను దక్షిణ మధ్య రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version